ఆదివాసీల సంకల్పమే వారి అద్భుత ప్రగతికి మూలం
* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. * ప్రపంచ స్థాయి బ్రాండ్ గా అరకు కాఫీ. * గిరిజనులకు మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం. కుప్పం,ఆగస్టు 09 (గరుడ ధాత్రి న్యూస్): ఆదివాసీల సంకల్పమే వారి అద్భుత ప్రగతికి మూలమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ప్రకృతిని ఆరాధిస్తూ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకునే గిరిజనులకు అవకాశాలు కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని పేర్కొన్నారు. సామాన్య ఆదివాసీ మహిళ అయిన...