GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 8:12 am Digital Edition : GURU SWAMY

ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు అవార్డు అందుకున్న పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు

ఈ క్రెడిట్ శానిటరీ సిబ్బందిదే.
అవార్డు మరింత బాధ్యత పెంచింది.
కుప్పంలో పచ్చదనం పరిశుభ్రతకు ప్రజలు మరింత సహకరించాలి.
కుప్పం పురపాలికకు అవార్డు పట్ల పలువురి హర్షం.
కుప్పం,జులై 18 (గరుడ ధాత్రి న్యూస్):
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమానికి కుప్పం పురపాలక సంఘం అవార్డు దక్కించుకుంది. కుప్పం పురపాలక సంఘం పరిధిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ఎంతో పకడ్బందీగా కొనసాగింది. కార్యక్రమాన్ని కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు వ్యూహాత్మకంగా, దిగ్విజయంగా కొనసాగించారు. పక్కగా పనులు కొనసాగడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కుప్పం పురపాలిక సంఘాన్ని అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును శనివారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా కుప్పం పురపాలిక సంఘం కు అవార్డు దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై పురపాలక సంఘం కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ అవార్డు రాక క్రెడిట్ మొత్తం పారిశుద్ధ కార్మికులు, సిబ్బందిదే అన్నారు. కుప్పంలో పచ్చదనం పరిశుభ్రతకు కుప్పం పురపాలక సంఘం పరిధిలోని ప్రజలు పూర్తిగా సహాయ సహకారాలు అందివ్వాలని ఆయన కోరారు. కుప్పం పురపాలక సంఘం అవార్డు అందుకోవడం పట్ల ఆయా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తూ కమిషనర్ను అభినందించారు.