GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 7:09 am Posted by : GURU SWAMY

“ఆపరేషన్ క్లీన్ స్వీప్” ను విజయవంతం చేయండి

-హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్

నగరంలో పరిశుభ్రతే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా నగరంలోని అక్కారంపల్లి మార్గంలోని ఓపెన్ డ్రైనేజి కాలువల్లో పేరుకు పోయిన చెత్త, మట్టిని జెసిబిల సాయంతో తొలగించారు. శుభ్రం చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది విస్తృత స్థాయిలో శుభ్రత పనులు చేపట్టారు. అక్కారంపల్లి రోడ్డు వెంబడి ఉన్న కచ్చా కాలువలో పేరుకు పోయిన చెత్త, మట్టిని తొలగించామని తెలిపారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో రోడ్ల పైన చెత్త తొలగింపు, డ్రైనేజీలలో పేరుకుపోయిన పూడిక మరియు వ్యర్థాలను తొలగించే పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. డ్రైనేజీ కాలువలను పూర్తిస్థాయిలో శుభ్రపరచి మురుగునీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకున్నారు. కాలువల్లో చెత్త వేయకుండా మీ ఇంటి వద్దకు వచ్చే మా సిబ్బందికి ఇచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్ వైజర్ సుమతి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.