“ఆపరేషన్ క్లీన్ స్వీప్” ను విజయవంతం చేయండి
-హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ నగరంలో పరిశుభ్రతే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో భాగంగా నగరంలోని అక్కారంపల్లి మార్గంలోని ఓపెన్ డ్రైనేజి కాలువల్లో పేరుకు పోయిన చెత్త, మట్టిని జెసిబిల సాయంతో తొలగించారు. శుభ్రం చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది విస్తృత స్థాయిలో శుభ్రత పనులు చేపట్టారు. అక్కారంపల్లి రోడ్డు వెంబడి...