GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 6:13 am Digital Edition : GURU SWAMY

ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట మరియు సంజీవిని కార్డు ప్రతో ఒక్కరు పొందాలి

టాటా డి.ఎన్. సి. సంజీవని పలమనేరు నియోజకవర్గ పేషంట్ కేర్ మేనేజర్ నిత్య

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్11

బైరెడ్డిపల్లి వైద్యాధికారి విజయచందర్ అధ్యక్షతన స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు టాటా డి.ఎన్. సి సంజీవని పలమనేరు నియోజకవర్గ పేషంట్ కేర్ మేనేజర్ నిత్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి కార్యక్రమం పై అవగాహన కల్పిస్తూ సేవలు మరియు సౌకర్యాల గురించి తెలియజేసారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ మరియు సంజీవిని కార్డు పొందాలనికె.సి.డి ట్రైనింగ్ ఇచ్చారు సంజీవని టాటా డి.ఎన్. సి. కార్డు ద్వారా స్పెషలిస్ట్ వైద్యులు మరియు డయాగ్నొస్టిక్ పరీక్షల కోసం అపాయింట్మెంట్ ,స్పెషలిస్ట్ డాక్టర్లతో ఆన్లైన్ వీడియో ద్వారా వైద్య సలహా ,
అవసరమైతే స్పెషలిస్ట్ రిఫరెన్స్ అపాయింట్మెంట్ ,
ఆరోగ్య సేవలు మరియు పథకాల గురించి సమాచారం ,ఆరోగ్య రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చడం,
ఇలా మరెన్నో ప్రతి ఆరోగ్య అవసరానికి హెల్ప్ లైన్ నెంబర్ టాటా డిఎన్సి సంజీవిని సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 గంటల నుండి సాయంకాలం నాలుగు గంటల వరకు సంప్రదించవచ్చు అన్నారు.155337 ఇ టోల్ ఫ్రీ నెంబర్ను ఎవరైనా సంప్రదించినప్పుడు వైద్య ప్రశ్నలు కుటుంబ ఆరోగ్య నిర్వహణ,వ్యక్తిగత ఆరోగ్య సమస్యలపై సంజీవిని టాటా డిఎన్సిని సంప్రదించండి కమాండ్ సెంటర్ కుప్పం సిబ్బంది ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఆరోగ్య సమస్యలపై సేవలు పొందాలని అవగాహన కల్పించారు.ఈకార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సావిత్రి,సిహెచ్ఓ,సూపర్వైజర్లు,ఎం.ఎల్.హెచ్.పి.ఎస్, ఏఎన్ఎంలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.