ఆరు నెలలుగా బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లిరుయా ఆసుపత్రిలో పనిచేస్తున్న 12 మంది నర్సింగ్ ఆర్డర్లీలకు న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు వినతి

తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో ఆప్కాస్ ద్వారా అవుట్‌సోర్సింగ్ విధానంలో నియమితులై పనిచేస్తున్న 12 మంది పురుష, మహిళా నర్సింగ్ ఆర్డర్లీలకు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ నేడు సీఐటీయూ నాయకులు చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు వాడ గంగరాజు, రుయా ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) వర్కింగ్ ప్రెసిడెంట్ కె. వేణుగోపాల్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి...