ఆర్ఎంపీ డాక్టర్ల ల్యాబ్లు పరిశీలించిన వైద్యాధికారి డాక్టర్ భువనేశ్వరి

కార్వేటి నగరం. ఆగస్టు 7 (గరుడదాద్రి న్యూస్ ) :ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కత్తిరిపల్లి పరిధిలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్స్ మరియు అనాథరైజ్డ్ గా నిర్వహిస్తున్నటువంటి ల్యాబ్ లను వైద్యాధికారి డాక్టర్ భువనేశ్వరి . తనిఖీలు నిర్వహించడం జరిగినది.. ముఖ్యంగా గత సంవత్సరం మండలంలోని ప్రతి ఒక్క ఆర్ఎంపి క్లినిక్ కి నోటీసులు జారీ చేయడం జరిగినది.ఆ నోటీసులో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం వాళ్లు అమలు చేస్తున్నారా లేదా అన్నది పరిశీలించడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వారికి తగు సూచనలు ఇవ్వడం జరిగినది