ఆర్టీసీ బస్ స్టాండ్‌లో చెత్తకు నిప్పు పెట్టిన ఆకతాయిలు -సత్వరమే స్పందించిన మునిసిపల్ కమిషనర్
పలమనేరు ఆగస్ట్ 01 ( గరుడ ధాత్రి ) : పలమనేరు ఆర్టీసీ బస్సు స్టాండ్ ప్రాంగణంలో ఉన్న చెత్తకు కొందరు ఆకతాయిలు నిప్పు పెట్టడంతో తీవ్ర పొగ అలముకుంది. ఈ పొగ బస్సు స్టాండ్ తో పాటు సమీపంలోని మునిసిపల్ కార్యాలయ ప్రాంతాన్ని కమ్ముకోవడంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే మునిసిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ స్పందించి, హుటాహుటిన మంటలను అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకున్నారు.ఈ సంఘటనపై శనివారం మునిసిపల్ కమిషనర్, ఆర్టీసీ డిపో...