జిల్లా కమిటీలో తొలిసారిగా బైరెడ్డిపల్లి కి సముచితస్థానం .
బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు19
చిత్తూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు సల్లా శివశంకర్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ చిత్తూరు లో ఘనంగా మంగళవారం ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ముఖ్య ఆతిధిగా మాజీ రాజ్యసభ సభ్యులు,ఆంద్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ గౌరవ చైర్మన్ టి.జి.వెంకటేష్ హాజరై నూతన జిల్లా ఆర్యవైశ్య వివిధ విభాగాల కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి అభినందించినరు.ఈ నూతన కమిటీ జిల్లాలో ఆర్యవైశ్యల అభివృద్ధికి కృషిచేసి రాష్ట్ర స్థాయిలో ప్రధమస్థానం దక్కించుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బైరెడ్డిపల్లి కి చెందిన కొత్తమాచు కరుణాకర గుప్త చిత్తూరు రూరల్ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు గా,లక్కనపల్లి కి చెందిన రఘుచంద్ర గుప్త జిల్లా సహా కార్యదర్శిగా,
చిత్తూరు రూరల్ ఆర్యవైశ్య యువజన సంఘం ఉపాధ్యక్షులుగా పరిపాటి రవికుమార్( బైరెడ్డిపల్లి),కందుకూరి రామనాథ్(లక్కనపల్లి),దిండుకుర్తి మనోజ్ (బైరెడ్డిపల్లి),పసుపర్తి కృష్ణమూర్తి(లక్కనపల్లి)లు జిల్లా రూరల్ ఆర్యవైశ్య సేవాదలళ్ సంఘంఉపాధ్యక్ష,సహా కార్యదర్శిగా,బైరెడ్డిపల్లి కి చెందిన కె.ఎస్.కళ చిత్తూరు రూరల్ ఆర్యవైశ్య మహిళా సంఘం ఉపాధ్యక్షులుగా,కందూరు ఆశాజ్యోతి,(లక్కనపల్లి)
కె.కె.భువనేశ్వరరి( బైరెడ్డిపల్లి), సహా కార్యదర్శిలుగా నియమితులు కావడంతో జిల్లా లో బైరెడ్డిపల్లి మండలం తొలిసారిగా జిల్లా కమిటీలో 9 పదవులు దక్కించుకోవడం విశేషం.ఈ సందర్భంగా తాము జిల్లా కమిటీలలో వివిధ విభాగాలకు ఎంపిక కావడంకు దోహదపడ్డ జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షుడు సల్లాశివశంకర్
కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.