రామచంద్రపురం మండలం కమ్మపల్లి–అప్పలాయగుంట మార్గమధ్యంలో శుక్రవారం రాత్రి భారీ కొండచిలువ నడిరోడ్డుపైకి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై కొద్దిసేపు సంచరించిన కొండచిలువను చూసి వాహనదారులు అప్రమత్తమయ్యారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సమీప గ్రామస్తులు సూచించారు. అటవీశాఖ అధికారులు స్పందించి కొండచిలువను సురక్షిత ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు కోరుతున్నారు.