GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 8:27 am Digital Edition : GURU SWAMY

ఆలయాల సందర్శనలో టీటీడీ ఈఓ

నాగలాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంతో పాటు సురుటపల్లిలోని శ్రీ పల్లికొండేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ ఈఓ ముద్దాడ రవిచంద్ర బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ డి. పద్మనాభరాజు, ఈఓ పి. లత ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఆలయాల విశిష్టతలు, అభివృద్ధి పనులు, పరిశుభ్రత, భక్తులకు అందిస్తున్న ప్రసాదాల నాణ్యతపై వివరాలు తెలుసుకున్న టీటీడీ ఈఓ రవిచంద్ర సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులను అభినందించారు. అనంతరం వేదాశీర్వచనం నిర్వహించి, ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.