ఆవులూరి మహేష్‌కు ఘనంగా జన్మదిన వేడుకలు

వెదురుకుప్పం, జూన్ 9 గరుడాద్రి న్యూస్ : వెదురుకుప్పం మండలం దిగువపల్లాలు పంచాయతీ ఆళ్లమడుగు దళితవాడకు చెందిన ఆవులూరి నాగయ్య కుమారుడు, అమర్ రాజా సంస్థ ఉద్యోగి ఆవులూరి మహేష్ జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులు, యువకులు కలిసి కేక్ కట్ చేసి మహేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, సన్నిహితులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.