ఆశా వర్కర్లకు నిర్బంధ సబ్‌సెంటర్ డ్యూటీలు రద్దు చేయాలి: ఐఎఫ్‌టీయూ డిమాండ్
ఆశా వర్కర్లకు నిర్బంధ సబ్‌సెంటర్ డ్యూటీలు రద్దు చేయాలి: ఐఎఫ్‌టీయూ డిమాండ్ గరుడధాత్రి న్యూస్ : ఆశా వర్కర్లపై నిర్బంధంగా విధిస్తున్న సబ్‌సెంటర్ డ్యూటీలను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక నాగలాపురం ధర్మరాజుల గుడి ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించినట్లు యూనియన్ అధ్యక్షురాలు జి.గీత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు దేశాండి అరుణాచలం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బాలింతలు, పసిపిల్లలు మరియు సామాన్య ప్రజల...