ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా.. అవసరమైతే అసెంబ్లీలో ప్రస్తావిస్తా: ఎమ్మెల్యే ఆదిమూలం సత్యవేడు, అక్టోబరు 6 గరుడధాత్రి: ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం హామీ ఇచ్చారు. అవసరమైతే అసెంబ్లీ సమావేశాల్లోనూ వారి సమస్యలను ప్రస్తావిస్తానని తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మెలుగు రమేష్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు మంగళవారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లను ఆశా వర్కర్లుగా మార్చి సమాన...