కుప్పం,ఆగస్టు 05 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రంలో కొనసాగుతున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంపై పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం సమీక్ష నిర్వహించారు. కేవలం 10 రోజుల్లోనే ఇంటింటి సందర్శనలు 26.98 లక్షల మార్క్ దాటడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ పార్టీ అధ్యక్షులు, పరిశీలకులు, కార్యకర్తలు ఇదే స్ఫూర్తి, ఉత్సాహంతో కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా కొనసాగించాలని అధినేత పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలకు అందించిన సంక్షేమ ఫలాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర పునర్నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలను క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ చేరేలా వివరించాలని ఆయన సూచించారు.