GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 7:46 am Digital Edition : GURU SWAMY

ఇంటింటికి తెలుగుదేశం ప్రగతికి సందేశం

– సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రగతికి పరుగులు
– కూటమి ప్రభుత్వం అంటేనే అభివృద్ధి సంక్షేమం
– ఇంటింటికి తెలుగుదేశంలో సత్యవేడు టిడిపి పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి

నారాయణవనం ఆగస్టు 16 (గరుడ ధాత్రి న్యూస్) చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సంక్షేమం అభివృద్ధి తో ప్రగతి పథంలో పరుగులు తీస్తుందని సత్యవేడు టిడిపి పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నారాయణవనం మండలం కళ్యాణపురం పంచాయతీలో మండల టిడిపి అధ్యక్షులు పి గిరిబాబు ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సత్యవేడు టిడిపి పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి కళ్యాణపురం పంచాయతీ లో చెరువు కట్ట పనులకు భూమి పూజ చేసిన అనంతరం వడ్డీ ఇండ్లు కాలనీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నరు. ఈ సందర్భంగా శంకర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రెండేళ్లలో సాధించిన ప్రజా సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రజలలో ఉన్న నమ్మకం విశ్వాసం ఇంటింటి తెలుగుదేశంలో స్పష్టంగా కనబడుతుందన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తూ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని సమస్యల పరిష్కారానికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కుమార్, మండల క్లస్టర్ ఇంచార్జి షణ్ముగం, కో క్లస్టర్ బాలసుబ్రమణ్యం, యూనిట్ ఇన్ చార్జీలు సి బాబు, పొన్ను స్వామి యాదవ్, ముని వేలు, ఎస్సీ సెల్ అధ్యక్షులు గోపి, గ్రామ కమిటీ అధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శి వాసు పళణి టిడిపి పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.