ఇంటింటికీ సంక్షేమం.. ప్రజల్లో పెరిగిన నమ్మకం: ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ!
ఓజిలి మండలం కురుగొండ గ్రామంలో వైభవంగా 'ఇంటింటి ప్రచారం'. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన ఎమ్మెల్యే పర్యటన! సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేస్తామని హామీ ఓజిలి జూలై 27 (గరుడ ధాత్రి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజాబాట పట్టి వివరిస్తున్నట్లు సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ వెల్లడించారు. "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" కార్యక్రమం విస్తృత ప్రచారంలో భాగంగా సోమవారం ఓజిలి...