ఇంధన ధరల పెంపుపై వామపక్షాల ఆగ్రహం

-జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు గరుడధాత్రి న్యూస్ : ఈరోజు సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీల కీలక సమావేశం జరిగింది. సమావేశానికి సిపిఐ(ఎం.ఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్ బాబు అధ్యక్షత వహించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా నాలుగు సార్లు పెంచడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. మరోసారి ధరలు పెంచబోతున్నారనే వార్తలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జూన్ 1 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కరపత్రాల...