ఇసుక అక్రమ రవాణాపై మైనింగ్ అధికారుల మెరుపు దాడులు
22 ఇసుక ట్రాక్టర్లు సీజ్.. తమిళనాడుకు అక్రమ రవాణాపై కేసులు నాగలాపురం, ఆగస్టు 13 (గరుడధాత్రి న్యూస్): నాగలాపురం మండలంలో ఇసుక అక్రమ రవాణాపై మైనింగ్ అధికారులు, పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. మండలంలోని నందనం ఇసుక రీచ్ పరిధిలో అరుణానది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 22 ట్రాక్టర్లను తిరుపతి మైనింగ్ ఏడీ బాలాజీ నాయక్ సీజ్ చేశారు. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచే మైనింగ్ అధికారులు, పోలీసు సిబ్బంది హైవేపై కాపుకాసి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాలపై నిఘా పెట్టారు....