GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 6:20 am Digital Edition : GURU SWAMY

ఈనెల 12న కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల ధర్నా

రామచంద్రాపురం: రాష్ట్ర వీఆర్ఏల సంఘం పిలుపు మేరకు ఈనెల 12వ తేదీన తిరుపతి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు రామచంద్రాపురం మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం తెలిపారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ మధుసూదన్‌రావుకు వినతిపత్రం అందించారు. వీఆర్ఏలకు వీఆర్వోలుగా వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా పదోన్నతి కల్పించాలని, పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టే ధర్నాకు వీఆర్ఏలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.