ఈస్ట్‌ హరిజనవాడలో పిచ్చికుక్క హల్‌చల్‌

*కుక్కకాటుకు పలువురికి గాయాలు సంబంధిత అధికారుల తక్షణ చర్యలకు స్థానికుల విజ్ఞప్తి ✒️నాగలాపురం పట్టణంలోని ఈస్ట్‌ హరిజనవాడలో పిచ్చికుక్క హల్‌చల్‌ చేస్తూ స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. వీధుల్లో తిరుగుతూ పలువురిని కరిచినట్లు స్థానికులు తెలిపారు. దీంతో కుక్కకాటుకు గురైన వారు నాగలాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించి ప్రథమ చికిత్స పొందుతున్నట్లు సమాచారం. పిచ్చికుక్క సంచారంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో వీధుల్లో తిరిగే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన...