GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 8:05 pm Posted by : GARUDA DHATRI NEWS

ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన

ఈ నెల 19న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటన

గరుడధాత్రి న్యూస్ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేదీన ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమంత్రి మే 19వ తేదీ ఉదయం 9.00 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని నివాసం వద్ద హెలిప్యాడ్‌ నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి, ఉదయం 10.00 గంటలకు కావలి మండలం తుమ్మలపెంట గ్రామ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతరులు స్వాగతం పలుకుతారు.
అనంతరం ఉదయం 10.15 గంటలకు తుమ్మలపెంట గ్రామంలోని ప్రజా వేదిక సమావేశ ప్రాంగణానికి చేరుకుని, ఉదయం 10.15 గంటల నుండి మధ్యాహ్నం 12.10 గంటల వరకు నిర్వహించే “మత్స్యకారుల సేవలో” కార్యక్రమంలో పాల్గొంటారు.
తదుపరి మధ్యాహ్నం 12.45 గంటలకు తుమ్మలపెంటలో ఏర్పాటు చేసిన ఇంటరాక్షన్ వేదిక వద్ద మత్స్యకారులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు పార్టీ కేడర్ సమావేశ వేదికకు చేరుకుని, మధ్యాహ్నం 3.00 గంటల వరకు పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 3.15 గంటలకు తుమ్మలపెంట హెలిప్యాడ్‌ నుండి హెలికాప్టర్‌లో బయలుదేరి, చిత్తూరు జిల్లాకు వెళ్తారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.