GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 7:55 am Posted by : GARUDA DHATRI NEWS

ఈ నెల 19 న గూడూరు లో మినీ మహానాడు

ఈ నెల 19 న గూడూరు లో మినీ మహానాడు
-వేదిక గూడూరు లోని పి వి ఆర్ కళ్యాణ మండపం

తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గం మినీ మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పా శిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం గూడూరు పట్టణంలోని గూడూరు నియోజకవర్గం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశంపార్టీరాష్ట్ర,పార్లమెంట్ కమిటీ సభ్యులు మండల కమిటీ సభ్యులు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్ లు, మండల అనుబంధం సంఘ సభ్యులతోపలువురు ముఖ్యనాయకులతో మినీమహానాడు నిర్వహణపై సమీక్షా సమావేశం ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా, కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం రాచర్లపాడు పరిధిలోని ఇఫ్కో కిసాన్ సెజ్ భూముల్లో పసుపు పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ మహా సభలు జరగనున్నాయి ఈ సభలను విజయవంతం చేయాలనీ ఉద్దేశ్యంతో మే 19 వ తేదీ గూడూరు పట్టణంలోని పి వి ఆర్ కళ్యాణ మండపం నందు గూడూరు నియోజకవర్గం మినీ మహానాడునునిర్వహించనున్నట్లు అయన తెలిపారు.
గత రెండేళ్లల్లో మరణించిన వారికి మినీ మహానాడులో సంతాపం తెలపాలని తీ ర్మానించామన్నారు. గూడూరు నియోజకవర్గంలో పార్టీ పరంగా భవిష్యతలో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి మినీ మహానాడు కావడంతో నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అన్ని విభాగాల నా యకులు పెద్దఎత్తున హాజరుకావాలని పిలుపుని చ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, రాష్ట్ర టీడీపీ నేత నెలబల్లి భాస్కర్ రెడ్డి,టీడీపీ నేత శివ కోటా రెడ్డి, రాష్ట్ర టీడీపీ కార్య నిర్వహణ కార్యదర్శి బిల్లు చెంచు రామయ్య,గూడూరు రూరల్ టీడీపీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు రాజు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, కోట మండలం టీడీపీ అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, చిట్టమూరు మండలం టీడీపీ అధ్యక్షులు గణపర్తి కిషోర్ నాయుడు, వాకాడు మండలం టీడీపీ అధ్యక్షులు దువ్వూరు మధుసుధన్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జలిల్ అహ్మద్,నెల్లూరు మోహన్, రాష్ట్ర టీడీపీ మహిళ విభాగం కార్యదర్శి మట్టం శ్రావణి, వాకాడు ఏ ఎం సి చైర్ పర్సన్ దార ప్రమీల,పాదర్తి కోటేశ్వరరెడ్డి, పలగాటి జితేంద్ర రెడ్డి,వాకా విజయ్ భాస్కర్ రెడ్డి,సన్నారెడ్డి విజయ్ శేఖర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి,తిరుమూరు దయాకర్,కొకర్ల మధు యాదవ్,షేక్ షంషూద్దీన్,షేక్ నౌషాద్, కోట ఎంపిటిసి దార సురేష్, శంకరయ్య,రమేష్,సురేంద్ర బాబు, తిరుమూరు మురళి, ఇన్నమాల అనుక్,టీడీపీ నాయుకులు, కార్యకర్తలు, టీడీపీ విభాగం కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.