* కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు.
కుప్పం, అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్):
కుప్పం పురపాలక సంఘంలో 4 తేదీ ఆదివారం ఇంటి మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10.00 గంటలకు పురపాలక సంఘం కార్యాలయ ప్రాంగణం లో జరుగుతుందన్నారు. ఎన్.టి.ఆర్.హౌసింగ్ స్కీం కు సంబంధించి 189 మంది అర్హులైన లబ్దిదారులుకు ఇంటి మంజూరు పత్రములు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి, ప్రభుత్వ విప్ డా. కంచర్ల శ్రీకాంత్, ఏపిఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం,కుప్పం ప్రాంత అభివృద్ధి సంస్థ (కడా) ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్, పీకే యం ఉడా చైర్మన్ చైర్మన్ డా”సురేష్ బాబు, చంద్రబాబు కార్యదర్శి కె. శ్రీకాంత్,మున్సిపల్ చైర్మన్ వి.సెల్వరాజ్ పాల్గొననున్నారని తెలిపారు. వైస్ చైర్మెన్లు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ మెంబర్లు మరియు కుప్పం ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని ఆయన కోరారు.