ఈ ఫలితాలు – మార్పునకు నాంది..! తమిళనాడులో టీవీకే గెలుపు కూటమికి రెడ్ సిగ్నల్ – ⁠విజేతలకు బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ అభినందనలు

దేశంలోని నాలుగు రాష్ట్రాల, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఫలితాలు రాజకీయ మార్పునకు నాంది అని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.. ప్రజలు విజ్ఞతతో ఓటేస్తారని, అధికారంలో ఉన్న పార్టీలు సక్రమంగా పని చేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారనడానికి బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఫలితాలే నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.. “తమిళనాడులో విజయ్ పార్టీ గెలవడం ఆంధ్రప్రదేశ్ లో కూడా మూడో ప్రత్యామ్నాయం దిశగా బీసీవై అడుగులకు స్ఫూర్తినిచ్చింది. దశాబ్దాల తరబడి రెండు...