GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 8:07 am Digital Edition : GURU SWAMY

ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిసిన ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ చినబాబు

రామచంద్రపురం మండలం: విజయవాడ సమీపంలోని ఉండవల్లి కరకట్టలోని నివాసంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naiduను రామచంద్రాపురం మండలం కమ్మపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ చినబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (MSME) అభివృద్ధి, పారిశ్రామిక ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేసే చర్యలపై కూడా అభిప్రాయాలను పంచుకున్నట్లు సమాచారం.