ఉచిత కంటి చికిత్స శిబిరంలో 43 మందికి వైద్య పరీక్షలు11మంది చికిత్స కు ఎంపిక
బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు2 బైరెడ్డిపల్లి జడ్.పి.ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం కుప్పం పి.ఈ.ఎస్.ఆధ్వర్యంలో మహాతి ఫౌండేషన్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 43 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా11 మంది కంటి ఆపరేషన్లకు ఎంపిక అయినట్లు మహతి ఫౌండేషన్ సిబ్బంది మునెప్ప పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య పరీక్షలు కు హాజరు అయిన వారికి మహతి ఫౌండేషన్ ఉచిత భోజన వసతి కల్పించారు.