కార్వేటినగరం. ఆగస్టు 23 గరుడదాద్రి న్యూస్
చిత్తూరు జిల్లా ఉత్తమ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అవార్డు గ్రహీత, యాదవ ఎంప్లాయిస్ సొసైటీ (YES) జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నా కుప్పస్వామి యాదవ్‌ను ఆదివారం కార్వేటినగరంలో ఘనంగా సన్మానించారు. GD నెల్లూరు నియోజకవర్గ YES నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ ఎంప్లాయిస్ సొసైటీ ప్రతినిధులు పాల్గొని ఆయనను శాలువా, పూలమాలలతో సత్కరించారు.
సమాజ సేవలో మరియు ఉద్యోగ బాధ్యతల్లో కుప్పస్వామి యాదవ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ప్రతినిధులు పేర్కొన్నారు.
ఈ సన్మాన కార్యక్రమంలో YES రాష్ట్ర కార్యదర్శి దేవేంద్ర యాదవ్, GD నెల్లూరు అధ్యక్షుడు జోగి గురుమూర్తి యాదవ్ కార్వేటినగరం YES అధ్యక్షుడు ఈ. వాసు యాదవ్, తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి జోగి గురుప్రసాద్ యాదవ్, టిడిపి నాయకుడు, న్యాయవాది మేళం వెంకట కృష్ణ యాదవ్, నాయకులు భీమారావు యాదవ్, మోహన్ మురళి యాదవ్, అప్పిచి మోహన్ యాదవ్, కోదండ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, గోవింద యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో అన్న కుప్ప స్వామి యాదవను సన్మానిస్తున్న యాదవ్ సంఘ సభ్యులు.