GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 8:17 pm Digital Edition : GURU SWAMY

ఉత్సాహంగా కొనసాగుతున్న ఇంటింటికీ తెలుగుదేశం

* 7 రోజుల్లో 17.61 లక్షల ఇళ్ల సందర్శన.
* పార్టీ యంత్రాంగానికి రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అభినందనలు.
* ప్రతిరోజు కార్యక్రమం కొనసాగుతున్న తీరును పర్య వేక్షిస్తున్న కేంద్ర పార్టీ కార్యాలయం.
కుప్పం,ఆగస్టు 03 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రంలో అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీ చేపట్టిన ‘ఇంటింటికీ తెలుగుదేశం, 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి- సంక్షేమం’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఏడో రోజైన ఆదివారం కూడా ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఏడు రోజుల్లో కూటమి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17,61,197 ఇళ్లను సందర్శించి, ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించారు. ఆదివారం సెలవు దినం అయినప్పటికీ, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏ మాత్రం విరామం తీసుకోకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏడో రోజు ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 3,01,197 ఇళ్లను సందర్శించారు. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం కొనసాగుతున్న తీరును రాష్ట్ర పార్టీ కార్యాలయం పర్యవేక్షిస్తోంది. పార్టీ యంత్రాంగం ఇంటింటా కార్యక్రమంలో చురుగ్గా భాగస్వామ్యం అవుతుండడం పట్ల జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేస్తూ అభినందించారు.