ఉత్సాహంగా కొనసాగుతున్న ఇంటింటికీ తెలుగుదేశం

* 7 రోజుల్లో 17.61 లక్షల ఇళ్ల సందర్శన. * పార్టీ యంత్రాంగానికి రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ అభినందనలు. * ప్రతిరోజు కార్యక్రమం కొనసాగుతున్న తీరును పర్య వేక్షిస్తున్న కేంద్ర పార్టీ కార్యాలయం. కుప్పం,ఆగస్టు 03 (గరుడ ధాత్రి న్యూస్): రాష్ట్రంలో అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీ చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం, 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి- సంక్షేమం' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఏడో రోజైన ఆదివారం కూడా ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది....