ఉద్యోగులపై వేధింపులు, అమర్యాదకర వైఖరిని అధికారులు మానుకోవాలి

-ఏపీఎన్జీజీఓ అధ్యక్షులు ఆనందబాబు హెచ్చరిక పలమనేరు, జూన్ 20 ( గరుడ ధాత్రి ) : ఇటీవల నియోజకవర్గ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల పట్ల కొంతమంది అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందని ఏపీఎన్జీజీఓ సంఘం పలమనేరు అధ్యక్షులు ఆనందబాబు పేర్కొన్నారు. ఉద్యోగులను చులకనగా చూడడం, అమర్యాదకరంగా మాట్లాడడం, హేళన చేయడం మరియు బానిసల మాదిరిగా వ్యవహరించడం వంటి ఘటనలపై సంఘానికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని ఆయన తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు...