GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 7:32 am Digital Edition : GURU SWAMY

ఉనికి కోసమే వైసిపి దీక్షల రాద్ధాంతం

వైసీపీపై శాంతిపురం టిడిపి నాయకుల ఆగ్రహం.
కుప్పం,ఆగస్టు 07 (గరుడ ధాత్రి న్యూస్): కేవలం ఉనికి కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తూ ఉందని శాంతిపురం తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం శాంతిపురం మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ శాసనమండలి సభ్యులు గౌని వారి శ్రీనివాసులు, శాంతిపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిగం ఉదయ్ కుమార్ నాయుడు, టిడిపి ప్రధాన నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, జెనీ, నాగరాజు, గోపాల్,అనసూయమ్మ లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ వ్యవహారం ముగిసిన ఆరు నెలల తర్వాత డీఎస్సీపై రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. వైసిపి ఐదేళ్ల పాలనలో ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోయారని, అటువంటివారు నేడు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించిందని గుర్తు చేశారు. డీఎస్సీ పేరుతో రాద్ధాంతం చేస్తున్నారని అది వారికి తగదని హితవు పలికారు. మంత్రి నారా లోకేష్ విద్యా శాఖను ఉన్నతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఐదేళ్లపాటు విధ్వంసకర పాలన కొనసాగించిన వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారని, కేవలం 11 సీట్లకే పరిమితమైన బుద్ధి రాలేదని పేర్కొన్నారు.