GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 28 May 2026, 6:58 pm Posted by : GARUDA DHATRI NEWS

ఉపాధి హామీ కూలీలకు తాత్కాలిక నీడ పరిశుభ్రమైన తాగునీరు సౌకర్యం కల్పించాలి- ఐ ఎఫ్ టి యు డిమాండ్

గరుడధాత్రి న్యూస్ :
నాగలాపురం మండలంలో పనిచేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పని చేసే ప్రదేశంలో తాత్కాలిక టెంట్ ద్వారా నీడ పరిశుభ్రమైన త్రాగునీరు సౌకర్యం కల్పించాలని ఐ ఎఫ్ టి యు నాయకులు ఆర్ మురుగేషన్ పత్రిక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.
నాగలాపురం పంచాయతీకి చెందిన గ్రామీణ ఉపాధి కూలీలు చెరువులో పూడికి తీసే పని చేస్తుండగా ఐ ఎఫ్ టి యు నాయకులు ఆర్ మురుగేష్ సందర్శించి పని దగ్గర ఉన్న పరిస్థితుల్ని కూలీలను అడిగి తెలుసుకున్నట్లు తెలియజేశారు.
ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ఉపాధి కూలీలు సుమారు 10గ్రూప్ లు 120మంది ఉపాధి కూలీలు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు పనిచేస్తున్నట్లు తెలియజేశారు తొమ్మిది గంటలకే ఎండ తీవ్రత ఎక్కువ అవుతుందని ఎలాంటి తాత్కాలిక నీడ మరియు త్రాగునీటి సౌకర్యం కల్పించడం లేదని ఆవేదన చెందారు.
త్రాగునీరు తాత్కాలిక నీడ సౌకర్యం లేనందున ఎక్కువ సేపు పని చేయలేక ఎండ తీవ్రతకు తట్టుకోలేక పోవడం వలన తక్కువ క్యూబిక్ మీటర్ మట్టి లోడడం వల్ల ఉపాధి హామీ పనిలో గిట్టుబాటు కూలి పొందలేకపోతున్నారని రెండు పూటలా ఫేస్ లింక్ వలన ఉపాధి కూలీలు ఇబ్బందులు పడుతున్నారని గత ప్రభుత్వాలలో ఉపాధి హామీ కూలికి గిట్టుబాటు ధర ఎక్కువ ఉండేదని సౌకర్యాలు ఎక్కువ ఉండేదని కూటమి ప్రభుత్వ హాయంలో ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు గిట్టుబాటు కూలి కరువయ్యాయని విమర్శలు చేశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఉపాధి హామీ కూలీలకు గిట్టుబాటు ధర రోజుకు మూడువందల పది రూపాయలు ఇవ్వాలని ప్రస్తుతం వారానికి వెయ్యి రూపాయలు లేదా కొందరికి 1200 రూపాయలు మాత్రమే వస్తుందని కనీస సౌకర్యాలు కల్పించాలని స్థానిక ఎంపీడీవో ఏపీవో వెంటనే స్పందించి ఉపాధి హామీ కూలీలు పని చేసే పని చేసే చోట పర్యవేక్షణ చేసి మెరుగైన సౌకర్యాలతో పాటు గిట్టుబాటు ధర రోజుకు 310 కల్పించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉపాధి కూలీలని సమీకరించి ఎంపీడీవో ఆఫీస్ ముందర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు దక్షిణామూర్తి పద్మ దినమని మరియు ఉపాధి కూలీలు పుంగ వనం కృష్ణవేణి లక్ష్మి పవిత్ర ఉమారాణి సుగుణ రేఖ మారి భారతి కాటమ్మ శ్రీవల్లి అలిమేలు అమావాస్య కలయివాని పవిత్ర లైలా విజయ తదితరులు పాల్గొన్నారు.