ఉపాధి హామీ పనుల్లో మహిళకు పాము కాటు

ఉపాధి హామీ పనుల్లో మహిళకు పాము కాటు నాగలాపురం మండలంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ మహిళను పాము కాటేసిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. నాగలాపురం నటరాజకుంటకు చెందిన ప్రేమ నాగలాపురం పరిధిలోని అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటుండగా అకస్మాత్తుగా ఓ పాము కాటేసింది. దీంతో సహచర కార్మికులు వెంటనే ఆమెను నాగలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు పరిస్థితిని గమనించి మెరుగైన చికిత్స కోసం నగరి ఏరియా ఆసుపత్రికి రిఫర్...