ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయం
పిచ్చాటూరులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు పిచ్చాటూరు, సెప్టెంబర్ 5 గరుడధాత్రి: విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తూ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయుల సేవలను స్మరించుకుంటూ పిచ్చాటూరు మండలంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకలకు మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి కె. హేమమాలిని, మండల ఇంచార్జ్ ఎంఈఓ ఏ....