ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు ప్రారంభం

పలమనేరు, సెప్టెంబర్ 03 ( గరుడ ధాత్రి ) : శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని పలమనేరు మండల విద్యాశాఖ అధికారులు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు వివిధ క్రీడా పోటీలు గురువారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభమయ్యాయి. మండల విద్యాశాఖ అధికారులు పి.లీలారాణి, పి.సుజాత, గవర్నమెంట్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు షంషీర్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారు. పీడీలుగా వ్యవహరించిన అల్తాఫ్, సుజాత, కృష్ణవేణి, సాజీయా ఉపాధ్యాయులకు పోటీలను నిర్వహించారు. ఉపాధ్యాయ నాయకులు భాస్కర్(గుండుబావి)...