ఉప్పల ధడియం రామమూర్తి స్మారక పురస్కారం అందుకున్న కవి ‘చలంకోట బురుజు మునస్వామి’
పలమనేరు, ఆగస్టు 02 ( గరుడ ధాత్రి ) : "సమాజం మేలుకోరేదే మంచి సాహిత్యం. అటువంటి సాహిత్యం సమాజ అభ్యున్నతికి దోహదపడటంతో పాటు మానవ వికాసానికి పునాదిగా నిలుస్తుంది" అని ప్రముఖ కవి చలంకోట బురుజు మునస్వామి పేర్కొన్నారు. స్థానిక కళామందిరంలో ఆదివారం ఉదయం నిర్వహించిన సాహిత్య కార్యక్రమంలో ప్రముఖ కవి, భాషా సేవకులు ఉప్పల ధడియం రామమూర్తి స్మారక పురస్కారాన్ని ఆయన అందుకెళ్లారు. పురస్కారంతో పాటు రూ. 10,000 నగదు బహుమతిని నిర్వాహకులు ఆయనకు బహుకరించారు.ఈ సందర్భంగా అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్...