తిరుపతి జిల్లా సత్యవేడు మండల కేంద్రంలోని ఉలవలచేను ప్రాంతంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డాన్ సర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్యవేడు సీఐ మురళి నాయుడు పర్యవేక్షణలో ఎస్సై సాయినాథ్ చౌదరి, ఎస్సై లావణ్య ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీసులు అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించారు. స్థానిక ప్రజలకు భద్రతా సూచనలు అందిస్తూ, గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్డాన్ సర్చ్లో పోలీస్ సిబ్బంది పాల్గొని పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రజల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అధికారులు తెలిపారు.