బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్1
బైరెడ్డిపల్లి మండలం లోని ఎం.కొత్తూరు గ్రామ వ్యవసాయ పొలాలు వద్ద బుధవారం సాయంత్రం పిడుగుపడింది.
ఆసమయంలో గ్రామంకు చెందిన రేడ్డెమ్మ (53) పశువులు మేపుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె అపస్మారకస్థితి కి చేరుకున్నది.స్థానికులు
108 వాహన సిబ్బంది కి సమాచారంఅందించారు.వారు ఆమెను చికిత్స నిమిత్తం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అని గ్రామస్థులు పేర్కొన్నారు.