ఆనందంలో రైతులు,టి.డి.పి.శ్రేణులు
బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్19
బైరెడ్డిపల్లి మండలంలోని ఎం.కొత్తూరు గ్రామం వద్ద శుక్రవారం రాత్రి హంద్రీనీవా జలాలు పరుగులు తీస్తున్నది.ఈ నేపథ్యంలో రైతులు ఆనందంకు అంతులేకపోతుంది.దీనికి తోడు టి.డి.లి శ్రేణులు ఈ జలాల వద్ద టి.డి.పి.జండాలు పట్టుకొని హర్షం వ్యక్తం చేస్తూ అపర భగీరథుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
సి.ఎం. కరువుసీమలో భూగర్భ జలాలు పెంపుకు చేస్తున్న కృషి అభినందనీయం అని రైతులు పేర్కొంటున్నారు. దీనికి తోడు వరుణుడు కరుణ చూపాలని కోరుకొంటున్నారు.