ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తో వృద్ధులకు చేయూత -ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

గరుడధాత్రి : ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ తో వృద్ధులకు, వితంతువులకు, ప్రత్యేక అవసరాలు వారికి ప్రభుత్వం చేయూతను అందిస్తుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. జూన్ 1వ తేదీన సోమవారం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిచ్చాటూరు మండలం పులికుండ్రంలో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయంలోనే పింఛన్లు భారీగా పెరిగిందని, తద్వారా వృద్ధులు, వితంతువులు, ప్రత్యేక అవసరాల వ్యక్తులు అన్నీ విధాలుగా ఆదుకుంటున్నామని ఎమ్మెల్యే వివరించారు. అలాగే స్పౌస్ ద్వారా...