ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ‘అస్ట్రాజెనెకా’ భారీ ప్రాజెక్టు

కుప్పం,జులై 28 (గరుడ ధాత్రి న్యూస్):ఏపీ ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలను తక్కువ ఖర్చులోనే అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంతర్జాతీయ ఫార్మా-బయోటెక్ దిగ్గజ సంస్థలైన అస్ట్రాజెనెకా, స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐల మధ్య కీలక ఎం ఓ యు కుదిరింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా అమరావతిలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వేదికగా దేశంలోనే మొట్టమొదటి "ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ" విధానానికి శ్రీకారం చుడుతూ 'ఇంటిగ్రేటెడ్ జెనోమిక్ సొల్యూషన్స్ సెంటర్'ను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రం ద్వారా ఊపిరితిత్తులు,...