GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 1:31 pm Posted by : GARUDA DHATRI NEWS

“ఎన్డీయే ప్రభుత్వ సంక్షేమం”…విజయోత్సవ సభను జయప్రదం చేద్దాం… -కోలా ఆనంద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు ఉదయం 10.00 గంటలకు తిరుపతి సమీపంలోని దామినేడు నందు జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలోను, రాష్ట్ర అభివృద్ధిలోనూ, శాంతి భద్రతల పరిరక్షణలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సుపరిపాలన సాగిస్తూ, రెండేండ్లు ప్రజారంజకమైన పాలన పూర్తయిన సందర్భంగా దామనేడులో “ఎన్డీయే కూటమి సంక్షేమ” భారీ బహిరంగ సభకు వేలాది సంఖ్యలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని బీజేపీ నేత రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ తెలిపారు.