ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలి

బైరెడ్డిపల్లి లోఎంపిటిసి, జెడ్పిటిసి అభ్యర్థుల పరిచయ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్ పిలుపు బైరెడ్డిపల్లి గరుడదాత్రి అక్టోబర్29 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఏకపక్ష విజయాన్ని సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలమనేరు శాసనసభ్యులు అమర్‌నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. బైరెడ్డిపల్లి మండలంలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల పరిచయ వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు...