ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలి
-పిచ్చాటూరు ఎంఆర్సీలో ఎంఈఓ హేమమాలిని సూచనలు
పిచ్చాటూరు మే 22 గరుడధాత్రి :
పిచ్చాటూరు మండలంలోని ఎంఆర్సీ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) శ్రీమతి హేమమాలిని పలు ముఖ్య సూచనలు చేశారు.
మండలంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే త్వరలో నిర్వహించనున్న “బడి పిలుస్తోంది” కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, సౌకర్యాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి విద్యార్థుల చేరికలు పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో ఎంఫీఎస్, బీపీఎస్, ఎఫ్ఎస్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు.