GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 8:00 am Digital Edition : GURU SWAMY

ఎన్.ఎస్.ఎస్ సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలి : డాక్టర్ ఉమారాణి

పలమనేరు, సెప్టెంబర్ 24 ( గరుడ ధాత్రి ) :

స్థానిక కళాశాలలో గురువారం ఎన్.ఎస్.ఎస్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలమనేరుకు చెందిన ప్రముఖ హోమియో వైద్యురాలు డాక్టర్ ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఆరోగ్య అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విద్యార్థినీ విద్యార్థులు ఎన్.ఎస్.ఎస్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, సమాజంలోని మారుమూల ప్రాంతాల ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థినులలో సాధారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యల పట్ల వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ, సామాజిక ఆరోగ్య పరిస్థితులపై పూర్తి అవగాహన పెంచుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అకడమిక్ అడ్వైజర్ డాక్టర్ రాజేంద్ర రెడ్డి, ఎన్.ఎస్.ఎస్ కో-ఆర్డినేటర్ దేవేంద్ర రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన రావు, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.