ఎన్.ఎస్.ఎస్ సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలి : డాక్టర్ ఉమారాణి

పలమనేరు, సెప్టెంబర్ 24 ( గరుడ ధాత్రి ) : స్థానిక కళాశాలలో గురువారం ఎన్.ఎస్.ఎస్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలమనేరుకు చెందిన ప్రముఖ హోమియో వైద్యురాలు డాక్టర్ ఉమారాణి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఆరోగ్య అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... విద్యార్థినీ విద్యార్థులు ఎన్.ఎస్.ఎస్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, సమాజంలోని మారుమూల ప్రాంతాల ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థినులలో సాధారణంగా తలెత్తే ఆరోగ్య సమస్యల...