ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోళ్లలో గణనీయమైన పురోగతి
- పొగాకు కొనుగోళ్ల పరిస్థితిపై సహచర మంత్రులు, ఎమ్మెల్యేలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు *అమరావతి, జూన్ 11:* ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీవీ (FCV) పొగాకు వేలం ప్రక్రియ గత పది రోజులుగా మెరుగుదల సంకేతాలను చూపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కొనుగోలుదారుల భాగస్వామ్యం పెరగడం, మార్కెట్‌లో లిక్విడిటీ మెరుగుపడడం, వేలం కేంద్రాల్లో తిరస్కరణలు గణనీయంగా తగ్గడం సానుకూల పరిణామాలని ఆయన పేర్కొన్నారు. పొగాకు కొనుగోళ్ల పరిస్థితిపై గురువారం సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల...