GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 06 August 2026, 8:03 am Digital Edition : GURU SWAMY

ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని ఘనంగా సన్మానించిన జనసైనికులు


పలమనేరు, ఆగస్టు 05 ( గరుడ ధాత్రి ) :

పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డిని బుధవారం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు (జనసైనికులు) స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించారు. ​పలమనేరు పట్టణ జనసేన ఇన్‌చార్జ్ హరీష్ రాయల్ పలమనేరు పిఏసీఎస్ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా, ఈ పదవి దక్కేలా ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ నియోజకవర్గంలో జనసైనికులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ, సముచిత స్థానం కల్పిస్తున్నందుకు ఎమ్మెల్యేను ఈ సందర్భంగా నాయకులు ప్రత్యేకంగా కొనియాడారు.​రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేస్తామని వారు స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి పూలచైతన్య, రూరల్ అధ్యక్షుడు నాగరాజు, గంగవరం మండల అధ్యక్షుడు చందు, నాయకులు అరుణ్ రాయల్, అనిల్, రాజేష్ భార్గవ్, శివ, అజయ్, గౌతమ్, మహేష్, కళ్యాణ్, రంజిత్, బాలు, విక్కీలతో పాటు జనసైనికురాలు మురాదు తదితరులు పాల్గొన్నారు.