ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని ఘనంగా సన్మానించిన జనసైనికులు

​ పలమనేరు, ఆగస్టు 05 ( గరుడ ధాత్రి ) : పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డిని బుధవారం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు (జనసైనికులు) స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలసి ఘనంగా సన్మానించారు. ​పలమనేరు పట్టణ జనసేన ఇన్‌చార్జ్ హరీష్ రాయల్ పలమనేరు పిఏసీఎస్ చైర్మన్‌గా నియమితులైన సందర్భంగా, ఈ పదవి దక్కేలా ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ నియోజకవర్గంలో జనసైనికులకు తగిన ప్రాధాన్యత ఇస్తూ, సముచిత స్థానం కల్పిస్తున్నందుకు...